గ్యాస్  స్టవ్  రిపేర్  చేస్తామని  బంగారం చోరీ..వృద్ధ దంపతులను కొట్టి  అపహరించారు.. మెదక్ జిల్లాలో ఘటన

గ్యాస్  స్టవ్  రిపేర్  చేస్తామని  బంగారం చోరీ..వృద్ధ దంపతులను కొట్టి  అపహరించారు.. మెదక్ జిల్లాలో ఘటన
  • 5 తులాల బంగారు నగలతో పరార్

చిన్నశంకరంపేట, వెలుగు: గ్యాస్  స్టవ్  రిపేర్  చేస్తామని చెప్పి వృద్ధ దంపతులను కొట్టి బంగారం ఎత్తుకెళ్లారు. మెదక్  జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల సావిత్రి, అంజయ్య దంపతులు ఇంటి వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గ్యాస్  స్టవ్​ రిపేర్​ చేస్తానంటూ వారిపై దాడి చేశాడు.

సావిత్రి ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఇంట్లో ఉన్న బంగారు నగలతో కలిపి ఐదు తులాల ఆభరణాలు తీసుకొని పరారయ్యాడు. వృద్ధుల తలపై బలంగా కొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం మెదక్  పట్టణంలోని ఓ ప్రైవేట్  ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.